
'నగలు, డబ్బు ..పాత బట్టల్లో దాచుకోండి'
విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ...
విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ...ప్రజల నిర్లక్ష్యం వల్లే నేరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పోలీసు సిబ్బందితో నేరాలు నియంత్రించలేమని పోలీస్ కమిషనర్ అన్నారు. అదనపు సిబ్బంది కావాలంటే రూ.100 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఆ భారం కూడా ప్రజలపైనే పడుతోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా... నగలు, నగదు చోరీ కాకుండా పాత పుస్తకాలు, పాత బట్టల్లో దాచుకోవాలంటూ ఉచిత సలహా ఇవ్వటం విశేషం.