పోలీసులకు సహకరించాలని వర్మను కోరాం..

vijayawada police clarity on Varma Detained In Gannavaram airport - Sakshi

సాక్షి, విజయవాడ: లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు అనుమతి నిరాకరించడంపై విజయవాడ పోలీసులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం విజయవాడ నగరపరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 114 సీఆర్‌పీసీ, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నాయని, అందువల్ల ప‍్రెస్‌మీట్‌ నిర్వహించుకునేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఐబీయమ్‌ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నట్లు పోలీసులు విడుదల చేసిన ఓ నోట్‌లో పేర్కొన్నారు.

చదవండి....(నేనేమైనా ఉగ్రవాదినా?: వర్మ సూటి ప్రశ్న )
(హే.. చంద్రబాబు ఎక్కడ ప్రజాస్వామ్యం: వర్మ)

వర్మ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీస్తూ, శాంతి భద్రతలకు పూర్తిస్థాయిలో విఘాతం ఏర్పడి, అశాంతి చెలరేగే అవకాశ ఉందని తమకు ముందస్తు సమాచారం ఉన‍్నట్లు తెలిపారు. బహరింగ ప్రదేశాల్లో నిర్వహించే ప్రెస్‌మీట్‌లో ఇతరులను కించపరిచే అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, ఇతరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి దూషణలు చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలకు నిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ విషయాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రెస్‌మీట్‌ ప్రయత్నం విరమించి శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులకు సహకరించాలని వర్మను కోరారు. ఈ మేరకు విజయవాడ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ పేరుతో ఓ లేఖను విడుదల చేసి, రాంగోపాల్‌ వర్మకు అందించారు.

కాగా తన ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, ట్విటర్‌ లైవ్‌ను పోలీసులు ఆపివేశారంటూ వర్మ మరో ట్విట్‌ చేశారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top