తొండంగిలో ‘డియర్‌ కామ్రేడ్‌’ సందడి | Vijay Devarakonda Dear Comrade Movie Shooting In East Godavari | Sakshi
Sakshi News home page

తొండంగిలో ‘డియర్‌ కామ్రేడ్‌’ సందడి

Nov 5 2018 8:08 AM | Updated on Nov 5 2018 8:08 AM

Vijay Devarakonda Dear Comrade Movie Shooting In East Godavari - Sakshi

తొండంగిలో అభిమానులతో ప్రముఖ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగాచిత్రీకరణ

తూర్పుగోదావరి, తొండంగి (తుని): వర్ధమాన నటుడు విజయ్‌దేవర కొండ హీరోగా తొండంగిలో చిత్రీకరిస్తున్న సిని మా షూటింగ్‌తో సందడి నెలకొంది. బిగ్‌బెన్‌ బ్యా నర్‌లో దర్శకుడు భరత్‌కుమార్‌ దర్శకత్వంలో డియర్‌ కామ్రేడ్‌ చిత్రం సినిమా షూటింగ్‌ కొద్ది రోజులుగా జరుగుతోంది. ఈ చిత్రంలో రష్మిక హీ రోయిన్‌గా నటిస్తుండగా పలువురు నటులతో పెళ్లి చిత్రీకరణ జరుగుతోంది. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా ఇప్పటికే గీత గోవిందం సినిమా పెద్ద హిట్‌ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

స్థానికుల సహకా రంతో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. గ్రామంలోని అభిమానులు విజయ్‌ దేవరకొండను కలుసుకుని తమ అభిమానాన్ని పంచుకుంటున్నారు. దీంతో అభిమానులతో తొండంగి గ్రామం సందడిగా మారింది. మరోవారం రోజులపాటు షూటింగ్‌ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement