తిరుమలలో దళారీల దండయాత్ర

Vigilance Officers Arrested Broker In Tirumala - Sakshi

విజిలెన్స్‌ అధికారుల అదుపులో మరో బడా దళారీ

సాక్షి, తిరుమల: తిరుమలలో దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి టీటీడీ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విజిలెన్స్‌ అధికారులకు మరో బడా దళారీ చిక్కారు. తిరుమలలో మూడు సిఫార్సు లేఖలపై 18 మంది భక్తులను దర్శనానికి పంపించిన దళారీ.. ఒక్కో వ్యక్తి నుంచి రూ.5,500 వసూళ్లు చేశారు. ఇతడు బెంగుళూరు,చెన్నైకు చెందిన భక్తులకు దర్శనం చేయించినట్లు తెలుస్తోంది. దళారీపై భక్తులే ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ సంఘటనపై విజిలెన్స్‌ అధికారులు గోప్యంగా విచారిస్తున్నారు. గత వారం భక్తుల నుంచి నగదు వసూలు చేసి కల్యాణోత్సవ టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నించిన దళారీని తిరుమల టూ టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

తిరుమలలో దళారుల అరెస్ట్‌
తిరుమల : శ్రీవారి దర్శనం కలి్పంచేందుకు భక్తుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న దళారులను తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్‌ చేశారు. నగరంలో నివాసముంటున్న వెంకటరమణ, శ్రీనివాసులు, శశికుమార్, ప్రేమ్‌కుమార్‌లు కొంతకాలంగా దళారుల అవతారమెత్తి భక్తుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. శనివారం రాత్రి రాంబగీచా సమీపంలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top