'విజయమ్మ దీక్షకు పూనుకోవడం శుభపరిణామం' | venkatrami reddy asks chandra babu naidu to learn from ys vijayamma | Sakshi
Sakshi News home page

'విజయమ్మ దీక్షకు పూనుకోవడం శుభపరిణామం'

Aug 15 2013 3:35 PM | Updated on May 29 2018 4:06 PM

రాష్ట్ర ప్రయోజనల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్ష చేయడానికి పూనుకోవడం శుభపరిణామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు.

అనంత: రాష్ట్ర ప్రయోజనల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్ష చేయడానికి పూనుకోవడం శుభపరిణామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం  మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. విజయమ్మ దీక్షను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఆమె చేపట్టబోతున్న దీక్షకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్షను స్వాగతిస్తున్నామని సమైక్యాంధ్ర రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ బుధవారం తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, మహిళా, కార్మికులందరూ విజయమ్మ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున ముందుకు రావాలని కోరారు. సీమాంధ్రకు చెందిన మాజీ మంత్రులు, రాజకీయేతర ప్రముఖులు, ఉద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థి నాయకులు, మేధావులు, రైతు నాయకులతో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు శివాజీ తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement