కలెక్టర్‌గారూ కరుణించండి | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గారూ కరుణించండి

Published Sun, Nov 9 2014 2:15 AM

venkata ramana reddy family members requiest to collector

తంబళ్లపల్లె: బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి గత నెల 3వ తేదీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు సమాచారం అందింది. ఇప్పటికి 37 రోజులు అవుతున్నా మృతదేహం స్వగ్రామానికి చేరలేదు. సమాచారం అందినప్పటి నుంచి భార్య లక్ష్మీదేవి, కుమారుడు ఆదినారాయణ, కుమార్తె అరుణ చివరిచూపు కోసం ఎదురు చూస్తున్నారు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఎవరిని సంప్రదించాలో తెలియకా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాయకులు, పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని, కలెక్టర్‌గారూ మీరైనా స్పందించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement