‘ఇంగ్లీషు నేర్చుకోవడంలో తప్పు లేదు’

Venkaiah Naidu Speech In NIT Convocation At West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: తెలంగాణకు వెళ్లినా, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినా సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీలో జరుగుగతున్న మొదటి స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఈ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మాతృభాషను మర్చిపోవద్దని సూచించారు. భాష, భావం రెండు కలిసి నడుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృ భాషలోనే మాట్లాడాలని.. ఇంగ్లీషు నెర్చుకోవటంలో తప్పు లేదన్నారు. భాషలు, వేషాలు వేరు కావచ్చు కానీ మనమంతా ఒక్కటే అని వెంకయ్యనాయుడు తెలిపారు.

దేశ సమైక్యత, సార్వభౌమత్వానికి విరుద్దంగా ప్రవర్తించకుడాదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజలకు‌ నేరుగా ఏ విధంగా చేరాలో సాంకేతిక పరిజ్ఞానం తెలియజేయాలన్నారు. వ్యవసాయంపై అందరూ దృష్టి పెట్టాలని  వెంకయ్యనాయుడు సూచించారు. ‌ముఖ్యంగా చదువుకున్న యువత వ్యవసాయంపై ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నీటి కోసం పోరాడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు.  వియత్నాంలో వరిని మన ఎంఎస్‌ స్వామినాథన్ పరిచయం చేశారని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. అటువంటి మనం ఎందుకు ఉత్పత్తి చెయలేకపోతున్నామని ఆలోచించాలన్నారు. రైతులకు మంచి సామర్థ్యం కలిగిన‌ విద్యుత్ అందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్, స్త్రీ శిశు శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి చేరూకువాడ రంగనాధారాజు, పార్లమెంటు సభ్యులు కనుమూరి రఘురామకృష్ణం రాజు, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top