'జిల్లాకో గ్యాంగ్ లీడర్ని తయారు చేస్తున్నారు' | Vasireddy Padma takes in Paritala Sunitha and Sri Ram | Sakshi
Sakshi News home page

'జిల్లాకో గ్యాంగ్ లీడర్ని తయారు చేస్తున్నారు'

Oct 18 2014 1:17 PM | Updated on Aug 10 2018 9:42 PM

'జిల్లాకో గ్యాంగ్ లీడర్ని తయారు చేస్తున్నారు' - Sakshi

'జిల్లాకో గ్యాంగ్ లీడర్ని తయారు చేస్తున్నారు'

తెలుగుదేశం పార్టీ నేతలు జిల్లాకో గ్యాంగ్ లీడర్ను, ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతలు జిల్లాకో గ్యాంగ్ లీడర్ను, ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ టీడీపీ ఆగడాలు రోజురోజూకు పేట్రేగిపోతున్నాయనడానికి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే టీ ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యలే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.

టీడీపీ ఫ్యాక్షనిజానికి ఆ పార్టీ నేతలే బెంబేలెత్తుతున్నారని విమర్శించారు. పౌర సరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ యువసేన పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రైవేట్ సైన్యం పేరుతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వారిని ఉద్దేశించి అన్నారు.

ఎన్నికల అనంతరం 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేతలు పొట్టన పెట్టుకున్నారని ఆమె గుర్తు చేశారు. దీనిపై తక్షణమే సమాధానం చెప్పాలని టీడీపీ నేతలను వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.  మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్ల గుండాయిజం, రౌడీయుజంపై టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మీడియా ఎదుట ప్రదర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement