breaking news
civil supplies minister andhra pradesh
-
'జిల్లాకో గ్యాంగ్ లీడర్ని తయారు చేస్తున్నారు'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతలు జిల్లాకో గ్యాంగ్ లీడర్‌ను, ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ టీడీపీ ఆగడాలు రోజురోజూకు పేట్రేగిపోతున్నాయనడానికి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే టీ ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యలే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. టీడీపీ ఫ్యాక్షనిజానికి ఆ పార్టీ నేతలే బెంబేలెత్తుతున్నారని విమర్శించారు. పౌర సరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ యువసేన పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రైవేట్ సైన్యం పేరుతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వారిని ఉద్దేశించి అన్నారు. ఎన్నికల అనంతరం 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేతలు పొట్టన పెట్టుకున్నారని ఆమె గుర్తు చేశారు. దీనిపై తక్షణమే సమాధానం చెప్పాలని టీడీపీ నేతలను వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌ల గుండాయిజం, రౌడీయుజంపై టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మీడియా ఎదుట ప్రదర్శించారు. -
రేషన్‌కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు 'ఈ-పాస్'
రాజమండ్రి: రాష్ట్రంలో రేషన్‌కార్డుల్లో అవినీతిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. అందుకోసం కొత్తగా ఈ-పాస్ విధానం అమల్లోకి తెస్తున్నామన్నారు. ఈ విధానం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లాను ఎంపిక చేసినట్లు ఆమె వివరించారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి వచ్చిన సునీత విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 5 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేసినట్లు సునీత తెలిపారు. రాష్ట్రంలో మొబైల్ వాహానాల ద్వారా ఆధార్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తున్నామని అందుకోసం ఈ ప్రక్రియను త్వరలో ఆచరణలో పెడుతున్నట్లు పేర్కొన్నారు దాన్యం కొనుగోలు విషయంలో రైతులు లాభపడే విధంగా చర్యలు తీసుకుంటామని సునీత రైతులకు భరోసా ఇచ్చారు.