ఉర్దూ భాషోపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా వాసి | urdu language union president of khalander basha | Sakshi
Sakshi News home page

ఉర్దూ భాషోపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా వాసి

May 8 2015 10:26 PM | Updated on Sep 3 2017 1:40 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ భాషోపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాకు చెందిన సీ.ఖలందర్‌బాషా ఎన్నికయ్యారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ భాషోపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాకు చెందిన సీ.ఖలందర్‌బాషా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, ఉర్దూ ఎస్‌సీఆర్‌టీ కోఆర్డినేటర్ ఇర్షాద్‌అలీబేగ్ శుక్రవారం విలేకర్లకు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ఉర్దూ భాషోపాధ్యాయులు కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

గౌరవ అధ్యక్షుడిగా ఎండీ అబ్దుల్ రవూఫ్ (కర్నూలు), ఉపాధ్యక్షుడిగా ఎండీ అబ్దుల్హ్రమాన్‌ఖాన్ (నెల్లూరు), ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఏ.సత్తార్ ఫయాజి (కడప), జాయింట్ సెక్రటరీగా ఎస్.మహమ్మద్‌సాహెబ్ (గుంటూరు), కోశాధికారిగా కే.ఫిరోజ్‌అహ్మద్ (చిత్తూరు) ఎన్నికయ్యారు.
(మదనపల్లె)

Advertisement
 
Advertisement
Advertisement