శ్రీవారి సేవలో సుప్రీం న్యాయమూర్తి సిక్రి | upreme Justice Sikri visted tirumula | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సుప్రీం న్యాయమూర్తి సిక్రి

Mar 30 2015 12:38 AM | Updated on Sep 2 2018 5:18 PM

శ్రీవారి సేవలో  సుప్రీం న్యాయమూర్తి సిక్రి - Sakshi

శ్రీవారి సేవలో సుప్రీం న్యాయమూర్తి సిక్రి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన  నైవేద్య విరామ సమయం అనంతరం ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు.

తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పట్టువస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement