బాణాసంచా గోదాము సీజ్: ఒకరి అరెస్ట్ | Unlicensed crackers godown seized | Sakshi
Sakshi News home page

బాణాసంచా గోదాము సీజ్: ఒకరి అరెస్ట్

Nov 6 2015 8:12 PM | Updated on Sep 3 2017 12:08 PM

విశాఖ నగరం గాజువాక ప్రాంతం బీసీరోడ్డులోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాను పోలీసులు పట్టుకున్నారు.

ఎంవీపీ కాలనీ (విశాఖ) : విశాఖ నగరం గాజువాక ప్రాంతం బీసీరోడ్డులోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాను పోలీసులు పట్టుకున్నారు. వై.శ్రీనివాసరావు అనే వ్యక్తి తన ఇంట్లో రూ.1.50 లక్షల విలువైన బాణాసంచాను ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బాణాసంచాను సీజ్ చేసి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును గాజువాక పోలీసులకు బదిలీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement