అర్ధరాత్రి అదృశ్య శక్తి ప్రదక్షణలు! | Unknown Women In Jwalamukhi Temple Videos Viral In Social Media | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి అదృశ్య శక్తి ప్రదక్షణలు!

Oct 22 2018 1:21 PM | Updated on Oct 22 2018 1:21 PM

Unknown Women In Jwalamukhi Temple Videos Viral In Social Media - Sakshi

మహిళ ప్రదక్షణలు చేస్తున్నట్లు వీడియో కెమెరాల్లో చిక్కిన దృశ్యం

ఆలయ పూజారి కృష్ణప్రసాద్‌ సైతం తనకు ఇలా శబ్ధాలు వినిపించాయని చెప్పడంతో కొందరు యువకులు తమ సెల్‌ఫోన్‌ కెమెరాల్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.

నెల్లూరు, ఆత్మకూరు: పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో శరన్నవ రాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. 10వ రోజు విజయదశమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా పట్టణంలోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో తాళాలు వేసిన తలుపులు వేసినట్లుగానే ఉండగా, అర్ధరాత్రి వేళ ఓ మహిళ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తుందని, గజ్జెల శబ్ధం వినిపిస్తోందని పుకార్లు షికార్లు చేశాయి. దుర్గాష్టమి రోజు రాత్రి నుంచి ఇలా జరుగుతుందని పలువురు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు.

ఆలయ పూజారి కృష్ణప్రసాద్‌ సైతం తనకు ఇలా శబ్ధాలు వినిపించాయని చెప్పడంతో కొందరు యువకులు తమ సెల్‌ఫోన్‌ కెమెరాల్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. పసుపురంగు వస్త్రాలు ధరించిన ఓ మహిళ ముఖం కనిపించకుండా ఆలయ ప్రాంగణంలో అర్ధరాత్రి ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాల వీడియోలు వెలుగులోకి వచ్చాయి.  ఆదివారం పలు టీవీ జర్నలిస్టులు ఆలయానికి చేరుకుని భక్తుల అభిప్రాయాలను చిత్రీకరిస్తుండడంతో అక్కడ సందడి నెలకొంది. మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారన్న వాదనలు ఓ వైపు వినిపిస్తున్న భక్తి మార్గంలో ఉండే పలువురు అమ్మవారి శక్తిగా దీనిని అభివర్ణిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement