పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు | United activists gherao Pallamraju | Sakshi
Sakshi News home page

పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు

Oct 15 2013 7:37 PM | Updated on Sep 1 2017 11:40 PM

పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు

పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు

తూర్పుగోదావరి జిల్లాలో అడుగడుగున కేంద్ర మంత్రి పల్లంరాజును సమైక్యవాదులు అడ్డుకుంటున్నారు.

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో అడుగడుగున కేంద్ర మంత్రి పల్లంరాజును సమైక్యవాదులు అడ్డుకుంటున్నారు. ఈ రోజు సామర్లకోటలో సమైక్యవాదులు ఆయనను  అర్ధగంటసేపు ఘోరావ్ చేశారు. రాజీనామా ఎందుకు చేయలేదని నిలదీశారు.  తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాకినాడ నుంచి సామర్లకోట వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సమైక్యవాదులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ తన చేతిలో ఏమీలేదని అంతా కేంద్ర చేతిలో ఉన్నట్లు  తెలిపారు.

అంతకు ముందు శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో మంత్రి శత్రుచర్ల విజయమరామరాజును సమైక్యవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆయన కాన్వాయ్‌పై సమైక్యవాదులు రాళ్లు, చెప్పులు విసిరారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement