ఉన్మాదమో.. ఉక్రోషమో

ఉన్మాదమో.. ఉక్రోషమో - Sakshi


 తణుకు క్రైం :తణుకు బ్యాంకు కాలనీలోని నం బర్-15 మునిసిపల్ పాఠశాల వెనుక వైపున గల రెండతస్తుల అపార్ట్‌మెం ట్‌లో పార్క్ చేసిన మోటార్ సైకిళ్లకు మంగళవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆరు మోటార్ సైకిళ్లు దహనమయ్యూయి. వాటి ట్యాంకులు పేల డంతో పెద్దఎత్తున శబ్దాలొచ్చాయి. వివరాల్లోకి వెళితే... బ్యాంకు కాలనీలోని అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక ఫ్లాట్, మొదటి, రెండు అంతస్తుల్లో నాలుగు ఫ్లాట్‌లలో ఐదు కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. ఎప్పటిలానే మోటారు సైకిళ్లను గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్ చేసుకుని ఎవరి ఫ్లాట్‌లలో వారు నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక శబ్దాలు రావడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్న వారు బయటకొచ్చారు. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో వారంతా హాహాకారాలు చేస్తూ మం టల్ని దాటుకుని పిల్లాపాపలతో బయట కొచ్చేశారు.

 

 అదే సమయంలో నిద్రలేచిన మొదటి, రెండో అంతస్తుల్లోని వారు బయటకొచ్చి చూడగా మంటలు, పొగ కమ్మేశారుు. విపరీతమైన వేడి వచ్చింది. మొదటి అంతస్తులో ఉంటు న్న వారంతా పక్కింటి బాత్‌రూమ్ పైకి.. అక్కడి నుంచి కిందకు దూకి బయటపడ్డారు. రెండో అంతస్తులోని వారు బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో కొందరు అపార్ట్‌మెంట్ పైకి వెళ్లిపోగా, కొందరు కిందకు దూకేశారు. అలా దూకిన వారిలో కొందరికి గాయూలయ్యూరుు. మంటల్ని ఆర్పేందుకు వెళ్లిన ఇజ్జురోతు సత్యనారాయణ జారిపడిపోవడంతో అతడి చేతి ఎముకలు విరిగాయి. మంటలు, మోటార్ సైకిళ్ల ట్యాంకుల పేలుడు ధాటికి గ్రౌండ్‌ఫ్లోర్ స్లాబ్ పెచ్చులు ఊడి బీటలు తీసింది. అపార్ట్‌మెంట్ మొత్తం మసిబారింది. కొంతసేపటికి తేరుకున్న అపార్ట్‌మెంట్‌వాసులు, స్థానికులు నీళ్లుపోసి మంట లను అదుపుచేశారు.

 

 లేకపోతే పక్కనే ఉన్న విద్యుత్ మీటర్లు అంటుకుని తీవ్ర నష్టం జరిగిఉండేది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి రామలింగేశ్వరరావు, సిబ్బంది అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దహనమైన వాహనాల విలువ సుమారుగా రూ.2 లక్షలు ఉం టుందని రామలింగేశ్వరరావు చెప్పారు. విద్యుత్ సిబ్బంది సైతం వెంటనే ఘటనా స్థలానికి వచ్చి సరఫరా నిలిపివేశారు. తణుకు సీఐ కె.గోవిందరావు, పట్టణ ఎస్సై అల్లు దుర్గారావు, రూరల్ ఎస్సై కొప్పిశెట్టి గంగాధరరావు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.

 

 ఆగంతకుడి పనేనా !

 ఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్లు.. ఈ ఘటనకు ముందు కాలనీలోని అదే ప్రాంతంలో మరొక ఇంటి వద్ద ఆగంతకుడు గోడదూకి పారిపోవడాన్ని బట్టి చూస్తే ఇది ఎవరో కావాలని చేసిన పనేనని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు ముందు బ్యాంకు కాలనీలోని యల్లారమ్మ ఆల యం గేటును ఎవరో బాదడం.. ఆ తరువాత గుడి ఎదురింట్లో మోటార్ సైకిళ్ల వద్ద అలికిడి వినిపించడంతో ఆ ఇంట్లోని వారు బయటకొచ్చి చూశారు. పొడవుగా.. సన్నగా ఉన్న ఓ యువకుడు ఆలయం ఎదురింట్లోని మోటార్ సైకిళ్ల వద్ద ఏదో చేయబోతున్నాడని గమనించి కేకలు వేశారు. దీంతో అతడు పారిపోయూడు. అరగంట తరువాత పక్కవీధిలోని అపార్ట్‌మెంట్‌లో మంటలు, పొగ రావడం చూశామని అగంతకుడిని చూసినవారు పోలీసులకు చెప్పారు. మోటార్ సైకిళ్ల దహనం ఆ ఆగంతకుడి పనేనేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

 ఇదిలావుండగా, మోటార్ సైకిళ్లు దహనమైన కొద్ది నిమిషాలకే ఆ యువకుడు అపార్ట్‌మెంట్ ఎదుట ప్రత్యక్షమయ్యూడు. దీంతో అతణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. ఆ యువకుడి గత చరిత్ర, ఇటీవల కాలంలో అతని వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో దీనికి కారణం అతడేనేమోననే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో అన్ని వాహనాలకు సైడ్ స్టాండ్ వేసి ఉండగా మొదటి వాహనం మాత్రం పడిపోయి ఉంది. ఆగంతకుడు ఆ వాహనాన్ని పడగొట్టి అందులోంచి పెట్రోల్ తీసి నిప్పుపెట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరు.. ఉన్మాదంతో చేసిన పనా లేక మరేదైనా కారణం ఉందా అనేది ఇంకా వెల్లడి కాలేదు.

 

 రెండో అంతస్తు నుంచి దూకేశాం

 మేం రెండో అంతస్తులో ఉంటున్నాం. శబ్దాలు, అరుపులు విని నిద్రలేచాం. బయటకొచ్చి చూస్తే పొగ కమ్మేసి ఉంది. మొదటి అంతస్తులోకి వెళ్లగా ఆ ప్రాంతమంతా పొగ కమ్మేయడంతో మెట్లు కనిపించలేదు. దీంతో పైనుంచి కిందకు దూకేశాం. నాకున్న రెండు మోటార్ సైకిళ్లు కాలిపోతుంటే ఒకదానిని పక్కకు లాగాను. అరుునా అది 50 శాతం కాలిపోరుుంది. మంటలను ఆర్పేందుకు నీళ్లు మోసే క్రమంలో కాలు జారి పడిపోయూను. మోచేయి విరిగిపోయింది. ఆపరేషన్ పడుతుందని డాక్టర్లు చెప్పారు. మా పైఅంతస్తులో ఉండే మహిళ కూడా కంగారుతో మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేయడంతో ఆమె కాలికి గాయమైంది. పిల్లల మొహాలకు మసిపట్టేసి ఉండటం చూసి భయపడిపోయాం. ఏమైపోతామో అనుకున్నాం.                  - ఇజ్జురోతు సత్యనారాయణ, అపార్ట్‌మెంట్ వాసి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top