రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి | Unidentified person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Oct 10 2013 2:26 AM | Updated on Sep 1 2017 11:29 PM

రోడ్డు దాటుతుండగా ఏదో వాహనం ఢీకొనడంతో ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే...

 షాద్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ :  రోడ్డు దాటుతుండగా ఏదో వాహనం ఢీకొనడంతో ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... మంగళవారం అర్ధరాత్రి షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ శి వారులో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళుతు న్న ఏదో వాహనం ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి (30) అక్కడికక్కడే మృ తి చెందాడు. బుధవారం తెల్లవారుజామున జీఎంఆర్ పెట్రోల్ సిబ్బంది గ మనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఏ ఎస్‌ఐ రమేష్‌రెడ్డి పరిశీలించి కేసు ద ర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసినవారు ఫోన్ నం. 08548252333, 9440795741, 9440795740కు సంప్రదించాలని కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement