అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. నిరుద్యోగభృతి కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు తమను నట్టేట ముంచారని నిరుద్యోగులు ధ్వజమెత్తారు.
పశ్చిమగోదావరి(ఏలూరు): అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. నిరుద్యోగభృతి కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు తమను నట్టేట ముంచారని నిరుద్యోగులు ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువకులు సోమవారం ఏలూరు నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
హామీలు నెరవేర్చలేకపోతే చంద్రబాబు గద్దె దిగాలంటూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పిన చంద్రబాబు కంటితుడుపు చర్యగా డీఎస్సీ నిర్వహించి చేతులు దులిపేసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.