అండర్ -12 క్రికెట్ టోర్నీ విజేత అనంతపురం | Under-12 cricket tournament, the winner of the Anantapur | Sakshi
Sakshi News home page

అండర్ -12 క్రికెట్ టోర్నీ విజేత అనంతపురం

Jan 12 2015 2:27 AM | Updated on Jun 1 2018 8:39 PM

అండర్ -12 క్రికెట్ టోర్నీ విజేత అనంతపురం - Sakshi

అండర్ -12 క్రికెట్ టోర్నీ విజేత అనంతపురం

సౌత్‌జోన్ పీఆర్ ఆనంద్‌మూర్తి స్మారక అండర్ -12 క్రికెట్ టోర్నీ విజేతగా అనంతపురం నిలిచింది.

రన్నర్స్ నెల్లూరు

అనంతపురం స్పోర్ట్స్: సౌత్‌జోన్ పీఆర్ ఆనంద్‌మూర్తి స్మారక అండర్ -12 క్రికెట్ టోర్నీ విజేతగా అనంతపురం నిలిచింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఆతిథ్య జట్టు విజయాలు సాధించగా, నెల్లూరు జట్టు మూడు విజయాలతో రన్నర్స్‌గా నిలిచింది. చివరి రౌండ్ పోటీల్లో కర్నూలు, నెల్లూరు జట్లు విజయం సాధించాయి. మూడో స్థానం కర్నూలు, నాల్గవ స్థానం చిత్తూరు, ఐదో స్థానం వైఎస్సార్ జిల్లా నిలిచాయి.
 
ఇండియా ఎంపికవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్లాలి : జిల్లా క్రికెట్ సంఘం  

అండర్ -12 క్రికెట్ కె రియర్‌కి కీలకం. ఇక్కడి నుంచే ఓ ప్రణాళికతో ముందుకెళితే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు పగడాల మల్లికార్జున, మచ్చారామలింగారెడ్డి అన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలనందజేశారు. సౌత్‌జోన్ అకాడమీ హెడ్ కోచ్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ టోర్నీలో రాణించిన 30 మంది క్రీడాకారులను ఆంధ్ర ప్రాబబుల్స్ జట్టుకి ఎంపిక చేస్తామన్నారు. అందులో రాణించిన వారికి ఆంధ్ర క్రికెట్ అకాడమీకి ఎంపిక చేస్తామన్నారు.
 
మ్యాచ్ వివరాల్లోకి వెళితే...
నెల్లూరు వర్సెస్ చిత్తూరు : ప్రధాన మైదానంలో నెల్లూరు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. జట్టులో రేవంత్ రెడ్డి 61, ప్రజ్వల్‌రాయ్ 22 పరుగులు చేశారు. చిత్తూరు బౌలర్ విష్ణువర్ధన్ 3 వికెట్లు తీసుకున్నాడు. చిత్తూరు జట్టు 29 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నెల్లూరు బౌలర్ ప్రజ్వల్‌రాయ్ 3 వికెట్లు తీశాడు. నెల్లూరు 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
 
కర్నూలు వర్సెస్ వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ జిల్లా జట్టు 48.1 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సాయిభరణి 20 పరుగులు చేశాడు. కర్నూలు బౌలర్లు లక్ష్మణ్ 3, సూర్యతేజ రెడ్డి, సాయిసూర్య తేజారెడ్డి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కర్నూలు జట్టు 24.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జట్టులో సాయికృష్ణ సింగ్ 35 పరుగులు చేశాడు. వైఎస్సార్ జిల్లా జట్టులో అన్వర్ 3 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement