పేరులో భాగ్యం.. తీరులో దౌర్భాగ్యం

Un Conditional Roads In Guntur - Sakshi

 అధ్వానంగా పారిశుద్ధ్యం

మౌలిక వసతులు కరువు

సాక్షి, లక్ష్మీపురం(గుంటూరు):  పేరులో భాగ్యం ఉన్నా.. తీరులో మాత్రం దౌర్భగ్యంగా ఉంది. నగరంలోని భాగ్యనగర్‌ ప్రాంతంలో రోజు రోజుకు పారిశుద్ధ్య సమస్యలతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు ఉన్నతాధికారులు పారి«శుద్ధ్య సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని వాపోతున్నారు. స్థానిక మారుతీనగర్‌ ప్రాంతంలో నుంచి భాగ్యనగర్‌ మహాప్రస్థానం మీదుగా స్వర్ణాంధ్రనగర్, తురకపాలెం వైపుగా వెళ్లే దారి మురుగు, చెత్తతో నిండిపోయి ఉంది. ఇటుగా వాహనదారులు ప్రయాణించాలంటే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయేనని ఆందోళన చెందుతున్నారు.

తవ్వారు వదిలేశారు
భాగ్యనగర్‌లో నగరపాలక సంస్థ అధికారులు ఇటివల కాలంలో యూజీడి పనులు కోసం గుంతలు తవ్వి పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో స్థానికంగా నివాసం ఉండే వారు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అంటున్నారు. అయితే పనులు పూర్తి అయిన తరువాత యథావిధిగా ఉంచాల్సిన రోడ్డును వదిలేసి వెళ్లి పోయారు. దీంతో నిత్యం ఈ ప్రదేశంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు రోడ్డు పైకి రావాలంటే ఆందోళన చెందుతున్నారు. నిత్యం చెత్త కుప్పలతో నిండిపోయి తినుబండారాలు సైతం దుర్వాసన వెదజల్లుతున్నాయని వాపోతున్నారు. ఈ ప్రాంతం చెత్తకుప్పలతో నిండిపోవడం, పారిశుద్ధ్య పనులు కూడా సకాలంలో జరుగక పోవడంతో ఈ ప్రాంత వాసులు విషజ్వరాలతో ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన దుస్తుతి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోగాలు వస్తున్నాయి
పేరుకు భాగ్యనగర్‌ తమ ప్రాంతంలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఊరు మధ్యలో ఉన్న ఊరు చివరలో ఉన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. భాగ్యనగర్‌ ప్రాంతం నుంచి తురకపాలెం వెళ్లేందుకు నిత్యం భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీనికి తోడు పేరుకు పోయిన చెత్తతో ఇబ్బందులు పడుతున్నాం.
– విజయలక్ష్మి, స్థానికురాలు

రోడ్డు బురదమయం 
మహాప్రస్థానం నుంచి భాగ్యనగర్‌ ప్రాంతంలో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్డంతా బురదమయంగా మారుతుంది. దీనికితోడు చెత్త కుప్పలు, భరించలేని దుర్వాసనతో స్థానికంగా విషజ్వరాల పాలవుతున్నాము.నిత్యం చెత్త కుప్పలతో నిండిపోయి తినుబండారాలు సైతం దుర్వాసన వెదజల్లుతున్నాయని వాపోతున్నారు. ఈ ప్రాంతం చెత్తకుప్పలతో నిండిపోవడం, పారిశుద్ధ్య పనులు కూడా సకాలంలో జరుగక పోవడంతో ఈ ప్రాంత వాసులు విషజ్వరాలతో ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన దుస్తుతి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-జోసఫ్, స్థానికుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top