ఇరు గ్రామాల మధ్య కొట్లాట

Two Villagers Are Fighting In Eccharla - Sakshi

ప్రయాణికులను ఆటో ఎక్కించలేదని ఘర్షణ

బడివానిపేట, కొత్తవానిపేట గ్రామాల్లో పోలీస్‌ పికెట్‌

ఎచ్చెర్ల క్యాంపస్‌ : ఆటోలో ప్రయాణికులను తీసుకువెళ్లే విషయంలో బడివానిపేట, కొత్తవానిపేట గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రామాల యువకులు ఒకరిపై ఒకరు దాడికి దిగేవరకు దారి తీసింది. బడివానిపేట గ్రామానికి చెందిన ప్రయాణికులను కొత్తవానిపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ తీసుకువెళ్లలేదని వారి వాదన. అయితే కొత్తవానిపేట ఆటోను బడివానిపేట గ్రామస్తులు మార్గమధ్యలో శుక్రవారం నిలిపివేశారు.

దీంతో ఇరు గ్రామాల యువకులు కొయ్యాం రోడ్డులో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇరు గ్రామాలకు చెందిన మైలపల్లి నారాయుడు, లక్ష్మణ, చంటి కొత్త అప్పన్న, అలుపాన అప్పన్న, నిమ్మ రాములతో పాటు మరి కొందరికి గాయాలయ్యాయి. విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో ఆయా గ్రామాలకు వెళ్లి సందర్శించారు. ఈ గ్రామాల్లో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసి, శాంతి భద్రతలు సమీక్షిస్తున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top