నదిలో పడి ఇద్దరు విద్యార్థినుల మృతి | Two students drown in Suvarnamukhi River | Sakshi
Sakshi News home page

నదిలో పడి ఇద్దరు విద్యార్థినుల మృతి

Nov 21 2015 4:58 PM | Updated on Sep 3 2017 12:49 PM

పిక్నిక్ కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందారు.

పార్వతీపురం (విజయనగరం) : పిక్నిక్ కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా డి.సిర్లాం సమీపంలోని సువర్ణముఖి నది వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మందలుక్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థినులు పిక్నిక్ కోసం సువర్ణముఖి నది వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కర్రి కవిత(13), తులసి(13) అనే ఇద్దరు ఆడుకుంటూ వెళ్లి సువర్ణముఖిలో పడి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. విద్యార్థినులు పిక్నిక్ వెళ్తున్న విషయం పాఠశాల యాజమాన్యానికి తెలియదని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement