విద్యుదాఘాతంతో ఇద్దరు వేటగాళ్లు మృతి | Two poachers killed in an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరు వేటగాళ్లు మృతి

Mar 4 2017 9:15 AM | Updated on Sep 5 2018 2:26 PM

విద్యుదాఘాతంతో ఇద్దరు వేటగాళ్లు మృతి - Sakshi

విద్యుదాఘాతంతో ఇద్దరు వేటగాళ్లు మృతి

పొలానికి రక్షణగా వేసిన విద్యుత్‌ కంచె తగిలి ఇద్దరు వేటగాళ్లు మృతిచెందారు

రొద్దం(అనంతపురం): పొలానికి రక్షణగా వేసిన విద్యుత్‌ కంచె తగిలి ఇద్దరు వేటగాళ్లు మృతిచెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రొద్దం మండలం శ్యాపురం గ్రామంలో శనివారం వెలుగుచూసింది.

గ్రామానికి చెందిన రైతు గొల్ల అంజినప్ప తన పొలంపై అడవి జంతువులు దాడి చేయకుండా విద్యుత్‌ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి కర్ణాటకలోని హుస్సేనాపురం గ్రామానికి చెందిన ముగ్గురు వేటగాళ్లు అటుగా వచ్చి.. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. మృతులు హుస్సేనాపురం గ్రామానికి చెందిన బోయ నర్సింహులు, బోయ చిన్నప్పగా పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement