ఆలమూరు, న్యూస్‌లైన్ : మండలంలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆలమూరు ఎస్సై సీహెచ్ విద్యాసాగర్ కథనం ప్రకారం ఉప్పల గుప్తం మండలం వాడపర్రుకు చెందిన జొన్నాడ నాగరాజు (35) కొంత కాలంగా రాజానగరం మండలం దివాన్‌చెరువులో నివసిస్తున్నాడు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
Oct 4 2013 3:11 AM | Updated on Aug 30 2018 3:56 PM
ఆలమూరు, న్యూస్‌లైన్ : మండలంలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆలమూరు ఎస్సై సీహెచ్ విద్యాసాగర్ కథనం ప్రకారం ఉప్పల గుప్తం మండలం వాడపర్రుకు చెందిన జొన్నాడ నాగరాజు (35) కొంత కాలంగా రాజానగరం మండలం దివాన్‌చెరువులో నివసిస్తున్నాడు. అక్కడి నుంచి ప్రతిరోజూ ఆలమూరు మండలం జొన్నాడ వచ్చి ఒక హోటల్‌లో పని చేసి, రాత్రికి తిరిగి దివాన్‌చెరువు వెళుతుంటాడు. గురువారం ఎప్పటిలాగే పని ముగించుకుని తెల్లవారుజామున తన మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా రాజమండ్రి నుంచి రావులపాలెం వస్తున్న లారీ అతడ్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆటో తిరగబడి..,
మండలంలోని నర్సిపూడికి చెందిన ఆటో డ్రైవర్ లంక గంగాధరరావు (34) ఆటో తిరగబడి మృతి చెందాడు. రావులపాలెం నుంచి ప్రయాణికులతో ఆటోలో అతడు బయలు దేరాడు. కొత్తూరు సెంటర్ వచ్చేసరికి ప్రయాణికులు దిగిపోయారు. దీంతో ఇంటికి వెళ్లిపోదామని భావించిన గంగాధరరావు ఆటోలో నర్సిపూడి వెళుతున్నాడు. గుమ్మిలేరు ఓఎన్‌జీసీ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈప్రమాదంలో గంగాధరరావు ఆక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై విద్యాసాగర్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement