కోడిపందెం శిబిరంపై పోలీసుల దాడి.. ఇద్దరు మృతి

Two dies after Police rides on Cock Fight Centers in Krishna District - Sakshi

సాక్షి, చిత్తపూరు : కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గొల్లగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందెం శిబిరంపై దాడి చేశారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నూతిలో పడిపోయి మృతిచెందారు. మృతులు చిట్టూరి శ్రీనివాసరావు(20), మేకల చెన్నకేశవరావు(26)గా గుర్తించారు. పండుగ రోజుల్లో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top