రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం | two died in krishna district road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

Feb 17 2016 1:17 PM | Updated on Aug 30 2018 3:58 PM

కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మోపిదేవి మండలం వికలాంగుల కాలనీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మోపిదేవి మండలం వికలాంగుల కాలనీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన పూల కొండలు (22), పూల నాగరాజు (18) బైక్‌పై వెళుతుండగా మంగళవారం రాత్రి ఓ వాహనం ఢీకింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement