తిరుమలలో మృతదేహాల కలకలం | two dead bodys recovered in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో మృతదేహాల కలకలం

Oct 22 2017 10:54 AM | Updated on Oct 22 2017 12:57 PM

two dead bodys recovered in tirumala

సాక్షి, తిరుపతి : తిరుమలలో రెండు మృతదేహాలు కలకలం సృష్టించాయి. అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న రెండు మృతదేహాలను చూసి భక్తులు కలవరపాటుకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే కొండపై ఉన్న మాధవ నిలయం ముందున్న కాలి బాటలో ఒక పురుషునితో పాటు మహిళ మృతదేహాలను చూసి భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, మార్చురీకి తరలించారు.  

మృతులు చిత్తూరుకు చెందిన తల్లీకొడుకులు పుష్ప(50), శేఖర్‌(37)గా గుర్తించారు. వీరిద్దరూ నెల రోజులుగా తిరుమలలోనే ఉంటున్నారు. వ్యవసాయంలో నష్టపోయి, తీవ్ర అప్పుల బాధతో తిరుమలకు చేరుకున్నారు. నెలరోజుల పాటు గడిపారు. అప్పుల బాధలు భరించలేకే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement