నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి | two child dies in water canal in chittoor district | Sakshi
Sakshi News home page

నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Nov 10 2015 11:15 AM | Updated on Apr 4 2019 4:44 PM

నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.

చిత్తూరుజిల్లా: నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పీలేరు మండలంలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయి. కాలనీలన్నీ జలమయం అయ్యాయి.

ఈ నేపథ్యంలో కలకడలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ధనూస్(12), జయ(12) కాలనీ పక్కనే ఉన్న నీటికుంటవైపు వెళ్ళారు. ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడిపోయి ఇద్దరూ చనిపోయారు. చిన్నారుల మృతితో స్ధానికంగా విషాదం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement