సీఎం చంద్రబాబు కోతలు పిట్టల రాయుడిని తలపిస్తున్నాయని ఎన్.తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం బదులు కనిపించని అరుంధతి నక్షత్రాన్ని సీఎం చంద్రబాబు చూపిస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వివాహ కార్యక్రమంలో చివరి అంకంలో పురోహితుడు నూతన వధూవరులకు ఆకాశంలో అరుంధతీ నక్షత్రాన్ని చూడమంటారని, కానీ ఇంతవరకు ఆ నక్షత్రాన్ని చూసిన వధూవరులెవ్వరూ లేరన్నారు.
అదే తరహాలోనే సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణం చేపట్టనున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచం మెచ్చేలా, స్వర్గాన్ని తలపించేలా అమరావతిని నిర్మిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం కోతలు పిట్టల రాయుడిని తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.