
సాక్షి, కడప : ఆలయాలపై రాజకీయ పెత్తనం తగ్గాలని ఆలయాల సంరక్షణ సంధాన కర్త రంగరాజన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవుని కడపలోని వెంకటేశ్వరస్వామి ఆలయంపై టీటీడీ అధికారులు చిన్న చూపు మానుకోవాలన్నారు. ఇక్కడ పనిచేస్తున్న అర్చకులకు జీత భత్యాలు తక్కువగా ఇవ్వడం అన్యాయం అన్నారు. సంభావన తక్కువ ఉన్న వారికి జీతం కూడా తక్కువ ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. టీటీడీలో ఈఓల పెత్తనం తగ్గాలని గతంలో సుప్రీం కోర్టు పేర్కొందని గుర్తు చేశారు. వారసత్వంగా వస్తున్న సంప్రదాయాలని కొనసాగించాలని కోరారు.