తిరుమలలో భారీ లడ్డూ స్కాం | TTD laddu scam in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భారీ లడ్డూ స్కాం

May 16 2015 12:37 PM | Updated on Aug 28 2018 5:55 PM

తిరుమలలో భారీ లడ్డూ స్కాం - Sakshi

తిరుమలలో భారీ లడ్డూ స్కాం

టీటీడీలో భారీ లడ్డూ స్కాం గుట్టును విజిలెన్స్ అధికారులు శనివారం రట్టు చేశారు.

తిరుమల: టీటీడీలో భారీ లడ్డూ స్కాం గుట్టును విజిలెన్స్ అధికారులు శనివారం రట్టు చేశారు. టీటీడీ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ లడ్డూ కూపన్లు
ముద్రించి వాటి ద్వారా శ్రీవారి ఆదాయానికి గండి కొడుతున్న ఇద్దరు టీటీడీ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల లడ్డూ కూపన్లలో నకిలీవి ఉన్నట్లు టీటీడీ ఉద్యోగులు గుర్తించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దాంతో టీటీడీ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ లడ్డూ కూపన్లు తయారవుతున్నట్లు గుర్తించి.. ఆ దిశగా విచారణ చేపట్టారు. దాంతో నిందితులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement