
ఎస్‌బీఐలో 2,780 కిలోల టీటీడీ బంగారం డిపాజిట్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన 2,780 కిలోల బంగారాన్ని 2.5% వడ్డీ కింద ఎస్‌బీఐలో దీర్ఘకాలిక ప్రాతిపదికన ఆలయ అధికారులు డిపాజిట్ చేశారు.
దీంతోపాటు ఈ ఏడాది మేలో ముంబై మింట్‌కు పంపించిన బంగారు నగలను కరిగించి శుద్ధి చేశారు. అనంతరం 705 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని తిరిగి టీటీడీకి అందజేశారు. దీనిని కూడా కలిపి మొత్తం 2,780 కిలోల బంగారాన్ని దీర్ఘకాలిక ప్రాతిపదికన డిపాజిట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ మణి పల్వేశన్ మాట్లాడుతూ.. టీటీడీ బంగారాన్ని తమ బ్యాంకులో డిపాజిట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్‌లోనూ ఇదే విధమైన సంబంధాలను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ ఆర్‌వీ దేశ్‌పాండే, డీజీఎం కులకర్ణి, ఏజీఎంలు మధుమోహన్‌పాత్రో, పూర్ణచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.