
బంగారు గొలుసులు కాజేసిన టీటీడీ ఉద్యోగి
శ్రీవారి ఆలయం పరకామణిలో టీటీడీ ఉద్యోగి ఒకరు చేతివాటం ప్రదర్శించారు. బంగారు గొలుసులు దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిపోయాడు.
తిరుమల: శ్రీవారి ఆలయం పరకామణిలో టీటీడీ ఉద్యోగి ఒకరు చేతివాటం ప్రదర్శించారు. బంగారు గొలుసులు దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిపోయాడు. శ్రీనివాసులు అనే ఉద్యోగి రెండు బంగారు గొలుసులు దొంగతనం చేయిబోయి పట్టుబడ్డాడు. పరకామణి నుంచి బయటకు వస్తున్న అతడిని విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేసినప్పుడు అతడి జేబులో బంగారు గొలుసులు బయటపడ్డాయి.
అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను కావాలని గొలుసులు తీయలేదని నమ్మించే ప్రయత్నం చేశాడు. తర్వాత నేరం ఒప్పుకున్నాడు. గొలుసులు బావుతున్నాయని తీసుకున్నానని చెప్పాడు. శ్రీనివాసులుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఉన్నతాధికారులు తెలిపారు. పరకామణి వద్ద విజిలెన్స్ తనిఖీలు కట్టుదిట్టంగా జరుగుతాయని, దొంగతనం చేసినవారు తప్పించుకునే అవకాశమే లేదని అన్నారు.