ప్రతి శుక్రవారం వీఐపీ దర్శనాలకు ‘బ్రేక్‌’ | TTD Canceles VIP Break Darshan On Every Friday | Sakshi
Sakshi News home page

ప్రతి శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

Jun 14 2019 3:23 AM | Updated on Jun 14 2019 8:17 AM

TTD Canceles VIP Break Darshan On Every Friday - Sakshi

తిరుమల : గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుమల శ్రీవారికి నిర్వహించే అభిషేకం ఇతర సేవల కారణాల వల్ల సంవత్సరం పొడవునా ప్రతి శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకే టీటీడీ అధికారులు పరిమితం చేశారు. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. అలాగే గతంలో నిర్ణయించిన మేరకు వేసవి రద్దీ దృష్ట్యా ఏప్రిల్‌ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు శని, ఆదివారాల్లో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ప్రొటోకాల్‌ పరిధిలోని వీఐపీలకు మాత్రమే పరిమితం చేశారు. వీఐపీ లు, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 30 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement