చిల్లర మాటలకు చిరునామా కిరణ్ కుమార్ రెడ్డి | TRS Leader Sravan Kumar degrades CM Kiran kumar reddy | Sakshi
Sakshi News home page

చిల్లర మాటలకు చిరునామా కిరణ్ కుమార్ రెడ్డి

Oct 21 2013 11:39 AM | Updated on Aug 18 2018 4:13 PM

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత దాసోజు  శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. చిల్లర మాటలకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చిరునామా అని వ్యాఖ్యానించారు. పీలేరులో కూడా సొంతంగా గెలవలేని పరిస్థితి కిరణ్దని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేదని  శ్రవణ్ అన్నారు.

ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన సోమవారమిక్కడ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి అనర్హుడని విమర్శించారు. తెలంగాణపై అసెంబ్లీకి తీర్మానం రాదని... కేవలం బిల్లు మాత్రమే వస్తుందని  శ్రవణ్ కుమార్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement