'ఆమె అతడిని...అతడు మరో ఆమెను ప్రేమించాడు' | Triangle love story in chittoor district | Sakshi
Sakshi News home page

'ఆమె అతడిని...అతడు మరో ఆమెను ప్రేమించాడు'

Jun 4 2014 1:05 PM | Updated on Nov 6 2018 7:53 PM

'ఆమె అతడిని...అతడు మరో ఆమెను ప్రేమించాడు' - Sakshi

'ఆమె అతడిని...అతడు మరో ఆమెను ప్రేమించాడు'

ఓ ట్రయాంగిల్ లవ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ఆమె అతడిని ప్రేమించింది.

తిరుపతి : ఓ ట్రయాంగిల్ లవ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ఆమె అతడిని ప్రేమించింది. అతను మరో అమ్మాయిని ప్రేమించాడు. అది తెలిసి కూడా... ప్రియుడి కోసం ఆ యువతి గడపదాటి వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ రెండు రోజులు అతని వెంటే తిరిగింది. దాంతో ఆ యువతి కుటుంబ సభ్యులు తమ అమ్మాయిని కిడ్నాప్‌ చేశారంటూ అతడిపై ఫిర్యాదు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న అతడు కంగారుపడి... తనకోసం  వచ్చిన ఆమెను ఇంటివద్ద వదిలిపెట్టేందుకు బయల్దేరాడు. అయితే రైలు దిగగానే.. అమ్మాయి బంధువులు కన్పించారు. అంతే  ఏమి చేయాలో వారిద్దరికి అర్థం కాలేదు... భయంతో పట్టాలపైకి దూకారు. అయితే అదే సమయంలో అటుగా వస్తున్న రైలు వారిని ఢీకొట్టింది. దీంతో అతడి కాళ్లు విరిగిపోగా, ఆమె గాయపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే పలమనేరు మండలానికి చెందిన ప్రియ, గంగవరం మండలానికి చెందిన ప్రసాద్ బాబును రెండేళ్లుగా ప్రేమిస్తోంది. అయితే ప్రసాద్ బాబు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ప్రియ ఇల్లు వదిలి ప్రసాద్‌ దగ్గరకు వచ్చింది. విషయం తెలుసుకున్న ప్రియ తల్లిదండ్రులు ప్రసాద్‌కు ఫోన్‌ చేసి... కేసు పెడతామని హెచ్చరించారు.

దీంతో ప్రియను ఇంటి దగ్గర వదిలి పెట్టేందుకు తిరుపతి వచ్చాడు. అదే సమయంలో రైల్వేస్టేషన్‌లో ప్రియ బంధువులు కన్పించటంతో భయపడిపోయిన ప్రియ, ప్రసాద్‌లు రైలుపట్టాలపైకి దూకారు. అటుగా వచ్చిన రైలు వారిని ఢీకొనటంతో ప్రసాద్‌ కాళ్లు తెగిపోగా... ప్రియకు గాయలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement