కొత్తపల్లి గీత గైర్హాజరుతో విచారణ వాయిదా! | trial postponed on forgery Signature | Sakshi
Sakshi News home page

కొత్తపల్లి గీత గైర్హాజరుతో విచారణ వాయిదా!

Sep 20 2014 7:25 PM | Updated on Oct 3 2018 6:52 PM

కొత్తపల్లి గీత - Sakshi

కొత్తపల్లి గీత

ఎంపి కొత్తపల్లి గీత గైర్హాజరవడంతో ఫోర్జరీ సంతకాలపై విచారణ వాయిదాపడింది.

విశాఖపట్నం: ఎంపి కొత్తపల్లి గీత గైర్హాజరవడంతో ఫోర్జరీ సంతకాలపై విచారణ వాయిదాపడింది. గత ఎన్నికలలో నామినేషన్ పత్రాలపై గీత ఫోర్జరీ సంతకాలు చేసినట్లు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ ఆదేశాల ప్రకారం జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈరోజు విచారణ నిర్వహించారు. ఈశ్వరి, గిరిజనులు విచారణకు హారజయ్యారు. గీత  హాజరుకాకపోవడంతో   విచారణను వాయిదావేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ కొత్తపల్లి గీత ఎన్నిక ప్రక్రియను అపహాస్యం చేసిందని విమర్శించారు. సభ్యత,సంస్కారం, ఆత్మగౌరవం ఉంటే ఎంపి పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఫోర్జరీ చేసినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈశ్వరి డిమాండ్ చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement