హజ్ యాత్ర పేరుతో ట్రావెల్స్‌ నిర్వాకం..

Travels Fraud To Huz Trip - Sakshi

సాక్షి, వైఎస్సార్ : ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్‌ మాసంలో హజ్ యాత్ర పేరుతో ప్రజలను మోసం చేసి కెఎస్ఎస్ ట్రావెల్స్ వారి నుంచి డబ్బులు, పాస్‌పోర్టులు వసూలు చేసి తరువాత నుంచి మొహం చాటేసింది. నిర్వాహకుల నుంచి ఎటువంటి స్పస్టమైన సమధానం రాకపోవటంతో ప్రయాణికులు మోసపోయామని గ్రహించారు. ఈ విషయంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, వారు కట్టిన నగదును, పాస్‌పోర్ట్‌లను వెనక్కు ఇప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ కడప ఎమ్మెల్యే అంజద్ బాషా డిమాండ్ చేశారు.

ఈ ఘటనకు భాద్యులైన ట్రావెల్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీసిఐడి విచారణ జరిపించి, భాదితులకు సత్వర న్యాయం అందించాలని అంజద్ బాషా కోరారు. పోలీసులు ట్రావెల్స్‌ యజమానులపై కేసు నమోదు చేసి, ధర్యాప్తు ప్రారంభించారు. నకిలీ ట్రావెల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నగదును పూర్తిగా కాకుండా వారి గురించి పూర్తిగా వాకబు చేసిన తరువాతే అడ్వాన్స్‌ చెల్లించాలని, ఈ విషయంలో అప్రమత్తత తప్పనిసరని జిల్లా ఎస్పీ సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top