రవాణా శాఖకు సిబ్బంది కొరత | Transport Department staff Shortage | Sakshi
Sakshi News home page

రవాణా శాఖకు సిబ్బంది కొరత

Jan 6 2014 2:42 AM | Updated on Sep 2 2017 2:19 AM

ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని తెచ్చే రవాణా శాఖలో సరిపడా సిబ్బంది లేరు. ప్రతి ఏటా జిల్లా నుంచి ప్రభుత్వానికి ఈ శాఖ

  విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని తెచ్చే రవాణా శాఖలో సరిపడా సిబ్బంది లేరు. ప్రతి ఏటా జిల్లా నుంచి ప్రభుత్వానికి ఈ శాఖ ద్వారా సుమారు 40 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ ఖాళీల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్ల  తరబడి ఈ శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఏడుగురు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరిని ఆర్టీసీకి డిప్యుటేషన్‌పై పంపించారు. వెహికల్ ఇన్‌స్పెక్టర్లు నలుగురున్నారు. ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లకు ఆరుగురున్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టెనో పోస్టులు రెండింటికి రెండూ ఖాళీగా ఉన్నాయి. రెండు డ్రైవర్ పోస్టులకు ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు.
 
 సిబ్బంది తక్కువుగా ఆండడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. దీంతో విధులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. రవాణశాఖాధికారులు ప్రతి రోజూ వాహన తనిఖీలు నిర్వహించడం, పన్నులు వసూలు చేయడం. ఎల్‌ఎల్‌ఆర్‌లు, డ్రెవింగ్ లెసెన్సులు, ఫిట్‌నెస్ సరిస్టికెట్లు మంజూరు చేయాల్సి ఉంటుం ది. అలాగే అతివేగంగా వెళ్లే వాహనాలను కూడా నియంత్రించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం విధించే లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ఆపసోపాలు పడుతున్నారు. గతేడాది రూ.42 కోట్లు లక్ష్యం కాగా కేవలం 39 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగారు. మరి ఈ ఏడాదైనా ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకుంటారో, లేదో చూడాలి. ఈ విషయాన్ని ఆర్టీఓ అబ్థుల్వ్రూప్ వద్ద న్యూస్‌లైన్ ప్రస్తావించగా సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement