
రేపు కోటి ఇంటికి జగన్ రాక
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన కోటి కుటుంబభ్యులను పరామర్శించేందుకు మంగళవారం వైఎస్‌ఆర్
తిరుపతి సిటీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన కోటి కుటుంబభ్యులను పరామర్శించేందుకు మంగళవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుపతికి రానున్నారు. సోమవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జగన్‌మోహన్‌రెడ్డి మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఆ కార్యక్రమం తరువాత ఢిల్లీనుంచి నేరుగా ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా కోటి కుటుంబసభ్యులు నివాసం ఉంటున్న మంచాల వీధికి చేరుకుని పరామర్శించనున్నారు.