నేడు జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పర్యటన | Today TRS MLAs tour in adilabad | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పర్యటన

Nov 1 2013 1:44 AM | Updated on Aug 17 2018 2:53 PM

కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, పెద్దపల్లి ఎంపీ డాక్టర్ జి.వివేకానందతోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, జోగు రామన్న, నల్లాల ఓదెలు, ఎస్.వేణుగోపాలాచారి, కావేటి సమ్మయ్య తదితరులు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు.

ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ :  కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, పెద్దపల్లి ఎంపీ డాక్టర్ జి.వివేకానందతోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, జోగు రామన్న, నల్లాల ఓదెలు, ఎస్.వేణుగోపాలాచారి, కావేటి సమ్మయ్య తదితరులు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాలతోపాటు జిల్లాలోని పలు గ్రామాల్లో వారు పర్యటించనున్నట్లు టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించే వారు ఇంద్రవెల్లి అమరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారని చెప్పారు. అనంతరం ఉట్నూరు ఏజెన్సీలోని గిరిజన తండాలను సందర్శించి దండారీ, గుస్సాడి ఉత్సవాల్లో పాల్గొంటారు. అదేవిధంగా అనంతరం వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతోపాటు, నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ప్రభుత్వం ఓదార్పు కరువు ఆత్యహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను వారు పరామర్శిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement