ఈనాటి ముఖ్యాంశాలు

Today Telugu News Feb 18th CM YS Jagan launches third phase of YSR Kanti Velugu - Sakshi

మూడవ దశ వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో ప్రారంభించారు. ఇదిలాఉండగా, పోలీస్‌ శాఖకు చెందిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. మరోవైపు చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఇక, చైనాలో కొవిడ్‌-19 బారిన పడి మరణించిన వారి సంఖ్య 1800 దాటింది. ఇకపోతే, ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఢిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్‌ (ఐడీఎస్ఏ)కి గోవా దివంగత సీఎం, కేంద్ర మాజీ రక్షణమంత్రి మనోహర్ పారికర్ పేరు పెడుతూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top