నేడు పల్స్‌పోలియో | today pulse polio program in vishakapatnam | Sakshi
Sakshi News home page

నేడు పల్స్‌పోలియో

Jan 19 2014 5:29 AM | Updated on Sep 2 2017 2:47 AM

పోలియో బారి నుంచి పిల్లల్ని రక్షించేందుకు ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అదనపు డెరైక్టర్ డాక్టర్ టి.గీతాప్రసాదిని కోరారు.

విశాఖపట్నం, న్యూస్‌లైన్: పోలియో బారి నుంచి పిల్లల్ని రక్షించేందుకు ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అదనపు డెరైక్టర్ డాక్టర్ టి.గీతాప్రసాదిని కోరారు. జిల్లాలో 4.02 లక్షల మంది పిల్లలకు పోలియో చక్కలు వేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలిపా రు. జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా ఆదివా రం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

డీఎం అండ్‌హెచ్‌వో కార్యాలయం లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ ఎన్.ఆర్.వి.సోమరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రెడ్డి శ్యామల, జిల్లా ఇమ్యుైనె జేషన్ అధికారి డాక్టర్ కె.విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement