నేడు పోలమాంబకు తొలేళ్లు | today Polamamba Jatra arrangements :Sub-Collector OSD | Sakshi
Sakshi News home page

నేడు పోలమాంబకు తొలేళ్లు

Jan 27 2014 2:42 AM | Updated on Sep 2 2017 3:02 AM

ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి గాంచిన శంబర పోల మాంబ అమ్మవారి జాతర సోమవారం తొలేళ్ల ఉత్సవంతో ప్రారంభం కానుంది.

శంబర(మక్కువ) న్యూస్‌లైన్: ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి గాంచిన శంబర పోల మాంబ అమ్మవారి జాతర సోమవారం తొలేళ్ల ఉత్సవంతో ప్రారంభం కానుంది. అమ్మవారి జాతరకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు, జిల్లా నలుమూలల నుంచి, పక్కజిల్లాలైన విశాఖ,శ్రీకాకుళంల  నుం చి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశముంది. ఇప్పటికే సుదూర ప్రాంతాలనుంచి బంధువులు గ్రామానికి చేరుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందు లు కలగకుండా సబ్ కలెక్టర్ శ్వేతామహంతి పర్యవేక్షణలో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే మక్కువ నుంచి శ ంబర, మామిడిపల్లి నుంచి శంబర రహదారి మరమ్మతుల పనులు ఇంకా చేస్తున్నారు. జాతరలో బందోబస్తు కోసం 800 మంది పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఆల య ఈవో నాగార్జున ఆధ్వర్యంలో వనంగుడి,  ప్రధానాలయం వద్ద వీఐపీ, రూ.25, రూ.10, ఉచిత దర్శన క్యూలు ఏర్పాటు చేశా రు. భక్తులు తాగునీటి కి  ఇబ్బందులు పడకుండా ఆరు మంచినీటి ట్యాంకుల ను, 30తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వనంగు డి, ప్రధానాలయం, జెడ్‌పీహైస్కూల్, వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. 
 
 అధికారులపై అసహనం వ్యక్తం చేసిన సబ్‌కలెక్టర్‌జాతర ఏర్పాట్లను సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి ఆదివారం పరిశీలించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూల వద్ద మట్టి ఉండడంతో ఈవో నాగార్జునపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే వీఐపీ క్యూ కోసం కాలువపై చెక్కలు వేసి ఏర్పాటు చేయడాన్ని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తాత్కాలిక మరుగుదొడ్లను పరిశీలించి ఒక్కో దాని దగ్గర ఇద్దరు స్వీపర్లను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ  దృష్ట్యా మం గళవారం అదనంగా మరో వాటర్‌ట్యాంకర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. దేవాదాయశాఖాధికారులు ఇంతవరకు రాకుండా పండగ  చూసేందుకు వస్తారా?అని ఈవోపై మండిపడ్డారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ   మామిడిపల్లి నుంచి శంబర వరకు, మక్కువ నుంచి శంబర వరకు రూ.12లక్షలతో రహదారు ల మరమ్మతులు జరిపిస్తున్నామని చెప్పారు. గ్రామంలో 16మంది వైద్యసిబ్బందితో నాలుగు వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాలుగుచోట్ల కంట్రోల్‌రూమ్‌లు, 50మంది కార్మికులతో పారిశుద్ధ్య  పనులు జరిపిస్తున్నామని,  గ్రామంలో రెండు చోట్ల ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. పార్వతీపురం ఓఎస్‌డీ కె.ప్రవీణ్ గ్రామంలో జరుగుతున్న జాతరకు బందోబస్తు నిమిత్తం సిబ్బందిని ఎక్కడెక్కడ నియమించాలో పరిశీలించి పోలీసులకు తగు సూచనలు అందజేశారు.  
 
 గ్రామానికి చేరుకున్న సిరిమాను కర్ర 
 సాలూరు మండలం మామిడిపల్లి గ్రామానికి  చెందిన రైతులు గౌరీశంకర్, తౌడుల వ్యవసాయ పొలంలో సేకరించిన సిరిమాను, గుజ్జుమాను కర్రను శంబరం గ్రామానికి చెందిన రైతులు ఆదివారం ఎడ్ల బండిపై తీసుకువచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement