
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఏపీలో మూడు...తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ అబ్దుల్ గఫూర్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తమిళనాడులోని ట్యూటికోరన్ ఓడరేవులో ఆయనను అరెస్టు చేశారు. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో నక్సల్ నేత పూనెం లింగన్న అలియాస్ శ్రీధర్ మృతదేహానికి రీపోస్టుమార్టం జరిపించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం నివేదికను సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని మెడికల్ బోర్డు సీనియర్ అధికారులకు స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలతో ఈ నెల 5న కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..