నేడు జిల్లా బంద్ | today districk strick | Sakshi
Sakshi News home page

నేడు జిల్లా బంద్

Feb 14 2014 3:42 AM | Updated on Aug 8 2018 5:51 PM

నేడు జిల్లా బంద్ - Sakshi

నేడు జిల్లా బంద్

లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు

నేడు జిల్లా బంద్ : భాను
 జగ్గయ్యపేట అర్బన్, : లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 14వ తేదీ శుక్రవారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాజీలేని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.
 
 ఈ బంద్‌కు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి వేరొక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement