 
															నేడు బెంగళూరు, విశాఖలకు ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం బెంగళూరు, విశాఖపట్నంలలో పర్యటించనున్నారు.
	హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం బెంగళూరు, విశాఖపట్నంలలో పర్యటించనున్నారు. ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తారు. అక్కడ కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో సమావేశమవుతారు. 
	
	తుంగభద్ర నుంచి రాయలసీమకు నీటి విడుదలపై చంద్రబాబు చర్చిస్తారు. అనంతరం అక్కడి నుంచి విశాఖకు బయలుదేరి వెళ్తారు. అక్కడి జన్మభూమి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని అధికారవర్గాలు తెలిపాయి.  
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
