అగ్గి పిడుగు అల్లూరి | today alluri jayanthi | Sakshi
Sakshi News home page

అగ్గి పిడుగు అల్లూరి

Jul 4 2014 12:53 AM | Updated on Aug 17 2018 8:01 PM

అగ్గి పిడుగు అల్లూరి - Sakshi

అగ్గి పిడుగు అల్లూరి

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు.

నేడు సీతారామరాజు జయంతి
భీవువరం : రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో విప్లవవీరుడు అల్లూరి చేసిన తిరుగుబాటుకు ఎంతో ప్రత్యేకత ఉంది. రెండేళ్ల పాటు బ్రిటిష్ పాలకులకు కంటి మీద కునుకులేకుండా చేసిన ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం. రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆయనకు మన పాలకులు సముచిత స్థానం ఇవ్వలేదనే చెప్పాలి.

పాలకోడేరు వుండలం మోగల్లుకు చెందిన అల్లూరి వెంకట్రాజు, నారాయుణవ్ములకు సీతారావురాజు 1897 జూలై 4వ తేదీన జన్మించారు. తండ్రి వెంకట్రాజు వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. సీతారావురాజు ప్రాథమికవిద్యను మోగల్లు, కొవ్వాడలలో, ఉన్నతవిద్యను భీవువరంలోని లూథరన్ హైస్కూల్, నరసాపురం టేలర్ హైస్కూల్, విశాఖలోని మిషన్ హైస్కూల్‌లో అభ్యసించారు.
 
విప్లవవీరుడిని విస్మరించిన ప్రభుత్వం

బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసి తెల్ల దొరలను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ప్రభుత్వం విస్మరించింది.అల్లూరి జన్మస్థలమైన మోగల్లులో కనీసం ఆయనను స్మరిస్తూ ఇంతవరకు ఏ ఒక్క ప్రాజెక్ట్‌ని ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో అల్లూరి అభిమానులు, జిల్లావాసులు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మోగల్లులో అల్లూరి స్మారక కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఆ పనులు సాగలేదు. ఇటీవల క్షత్రియసేవా సమితి, అల్లూరి సీతారామరాజు సేవా కమిటీల ఆధ్వర్యంలో ఆయన స్వస్థలంలో స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారు.

ఈ పనులు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. తెలుగువాడి గుండె చప్పుడిని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వీరుడికి ప్రభుత్వాలు గుర్తింపునివ్వకపోవడం దారుణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేసి సర్కారు చేతులుదులుపుకుంది. సీతారామరాజును భావితరాలు స్మరించే విధంగా మోగల్లులో స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
 
అధికారిక కార్యక్రమంగా జయంతి

సీతారావురాజును పట్టుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అస్సాం రైఫిల్స్, వులబారు స్పెషల్ పోలీసులు, బళ్లారి, కోరవుండల్, ఈస్ట్‌కోస్ట్ రైఫిల్స్, కోరాపుట్ రిజర్వు పోలీసులను రంగంలోకి దింపింది. ఎప్పటికప్పుడు అల్లూరి చాకచక్యంగా తప్పించుకుని ఉద్యవూన్ని కొనసాగించారు. 1924 మే 7న సీతారామరాజును బ్రిటీష్ సైన్యం చుట్టుముట్టి  తుపాకులతో కాల్చి చంపారు. భౌతికంగా ఆయున వున వుధ్య లేకున్నా ప్రజల గుండెల్లో నేటికీ విప్లవీరుడుగానే నిలిచిపోయూరు. అల్లూరి స్ఫూర్తితో అనేక మంది  స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి, వర్ధంతిలను అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement