ఓ టెంకాయతో మీ కష్టాలన్నీ తీరుస్తామంటూ ఓ గ్యాంగ్ కొన్నాళ్లు గా పలమనేరు ప్రాంతంలో సంచరి స్తోంది.
పలమనేరు ప్రాంతంలో హైటెక్ మోసగాళ్ల సంచారం
డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్న బాధితులు
పలమనేరు: ఓ టెంకాయతో మీ కష్టాలన్నీ తీరుస్తామంటూ ఓ గ్యాంగ్ కొన్నాళ్లు గా పలమనేరు ప్రాంతంలో సంచరి స్తోంది. వీరి మాయమాటలకు మోసపోయిన పలువురు బాధితులు ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతున్నా రు. నలుగురు కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి ఆ గ్రామంలో ఒంటరి ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. తాము శ్రీశైలం నుంచి వచ్చామని, అక్కడ ఉచిత అన్నదానం కోసం చందాలివ్వాలని పరిచయం చేసుకుంటున్నారు. ఆపై తమ వద్ద ఓ మహిమ గల టెంకాయ ఉందని, దీన్ని ఇంట్లో ఉంచుకుంటే అన్ని కష్టాలు తీరుతాయంటూ నమ్మబలికి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది.
ఆ మేరకు రెండ్రోజుల క్రితం పలమనేరు మండలంలోని కొలమాసనపల్లె గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులనూ బురిడి కొట్టించారు. వారికి ఓ బట్ట చుట్టిన టెంకాయను అందించి రూ.8వేలు తీసుకెళ్లారు. ఈ విషయమై పలమనేరు సీఐ బాలయ్యను వివరణ కోరగా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.