'తిరుపతిని మెగాసిటీగా మారుస్తాం' | Tirupati to be Developed into Mega City, says K E Krishna murthy | Sakshi
Sakshi News home page

'తిరుపతిని మెగాసిటీగా మారుస్తాం'

Aug 31 2014 8:35 AM | Updated on Apr 3 2019 5:55 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుపతి నగరాన్ని మహాసిటీగా మారుస్తామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తిరుపతిలో వెల్లడించారు.

తిరుమల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుపతి నగరాన్ని మెగాసిటీగా మారుస్తామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తిరుపతిలో వెల్లడించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందని కేఈ తెలిపారు. ప్రజల కష్టాలను తీర్చడంమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అటవీ శాఖ మంత్రి  బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామని ఆయన స్పష్టం చేశారు.

పోలీసులు మీడియా సహకారంతో ఎర్రచందనం స్మగ్లింగ్ను చాలా వరకు అరికట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వద్ద నిల్వ ఉన్న బి,సి గ్రేడ్ ఎర్రచందనాన్ని ఆన్లైన్ ద్వారా వేలం వేస్తామని బొజ్జల చెప్పారు. అంతకు ముందు తిరుమలలో శ్రీవారిని కేఈ కృష్ణమూర్తి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు దర్శించుకున్నారు. వీరికి టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగానాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement