శేషాచలం ఎన్కౌంటర్ కేసు విచారణ 24కి వాయిదా | tirupati sheshachalam encounter case postponed on april 24th | Sakshi
Sakshi News home page

శేషాచలం ఎన్కౌంటర్ కేసు విచారణ 24కి వాయిదా

Apr 22 2015 11:57 AM | Updated on Aug 31 2018 9:15 PM

తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్ కేసుపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ..

హైదరాబాద్ : తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్ కేసుపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.  కోర్టు ఆదేశాల మేరకు మృతులకు పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు బుధవారం ఆ నివేదికను కోర్టుకు సమర్పించారు. అంతకుముందు నిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో మృతదేహాలకు మరోసారి శవపరీక్ష నిర్వహించారు.

 

ఆ పోస్టుమార్టం నివేదికను తమకు మాత్రమే ఇవ్వాలన్న ఆదేశాల మేరకు సీల్డు కవర్‌లో నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళనాడుకు చెందిన కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement